మే నెల 20 తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3. 00 గం లకు తెనాలి లోని వేమూరు - తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ(చినరావురు పార్క్ దగ్గర) కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సన్నాహక సమావేశం జరుగు తుందన్నారు. ఈ నెల 27, 28 తేదీలలో ఓంగోలు లో జరిగే మహానాడు కార్యక్రమం విజయవంతం చేయడానికి ఈ సన్నాహక సమావేశం, వేమూరు నియోజకవర్గ సమీక్ష సమావేశం, క్లస్టర్ ఇంచార్జిల నియామకాల కు సంబంధించి సమావేశం జరుగుతుందన్నారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా వేమూరు నియోజకవర్గ పరిశీలకులు, వినుకొండ మాజీ శాసన సభ్యులు, నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు జి. వి, ఆంజనేయులు, మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు పాల్గొంటారు. కావున వేమూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.