రాజ్యసభ సీట్ల కేటాయింపులో ఇప్పటికే బీద మస్తాన్ మరియు కృష్ణయ్య సీఎం జగన్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. ఐతే ఇదే క్రమంలో తాజాగా వైయస్ఆర్ సీపీ రాజ్యసభ అభ్యర్థి ఎస్. నిరంజన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా బీ ఫామ్ అందుకున్నారు. ఇంకా పోతే నాల్గవ వ్యక్తి విజయ్ సాయి రెడ్డి మొదటిలోనే సీఎం జగన్ మరియు భారతి దంపదులకి ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే.