జిల్లాలో ఇంకా 10 723 గృహల నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉందని గ్రామ సచివాలయ ల వారీగా ఇంకా ప్రారంభించని నిర్మాణాలను సమీక్షించుకుని ప్రారంభించేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ గృహ నిర్మాణాలపై ఆర్ డి వో లు, తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ సిబ్బందితో జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం మూడు రోజులుగా 433 గృహ నిర్మాణాలను ప్రారంభించడం జరిగిందని ఇంకా ప్రారంభించాల్సి ఉన్న గృహ నిర్మాణాలకు సంబంధించి మండలాల వారీగా సమీక్షించారు. మొత్తం బిబి ఎల్ లో 553 సచివాలయాలలో 20, 789, బి ఎల్ లో 16887, ఆర్ ఎల్ లో 4566, ఆర్సి 9498, పూర్తి అయిన గృహాలు 4136 ఉన్నాయని అన్నారు.
ఇప్పటివరకు గృహ నిర్మాణాలకు సంబంధించి 27శాతం కేటాయించిన నిధులు ఖర్చు చేశారని అన్నారు. ప్రారంభించిన గృహాలకు సంబంధించి స్టేజి కన్వర్షన్ వేగంగా చేయాలని అన్నారు. అదేవిధంగా ఓ టి ఎస్ కు సంబంధించి ఎనిమిది వేల గృహాలకు ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాల్సి ఉందని ఈ వారం లోపల పూర్తిచేయాలని అన్నారు.