యల్లనూరు మండల వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 4 వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఇంచార్జ్ ఎంపీడీఓ విజయ శేఖర్ నాయుడు పేర్కొన్నారు. అయన మాట్లాడుతూ. మండలంలోని యల్లనూరు - 1, తిరుమలాపురం-1, దంతలపల్లి-1, శింగవరం-1 మొత్తం 4 వాలంటీర్ పోస్టులకు ఈనెల 23వ తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హత, ఆసక్తి గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa