నందికొట్కూరు నియోజకవర్గం నంద్యాల జిల్లాల్లో కలిపి నెలలు గడుస్తున్నా ఇంత వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం బోర్డులపై కర్నూలు జిల్లా పేరు మాత్రమే కనిపిస్తుంది. నంద్యాల జిల్లాగా అధికారులు ఎవరూ కూడా బోర్డులపై పేరు మార్చకపోవడం శోచనీయమని స్థానికులు విమర్శిస్తున్నారు. నంద్యాల జిల్లాలో జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం ఏర్పాటుచేసిన నందికొట్కూరులో మాత్రం జిల్లా పేరు మారలేదు.