అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఉత్తర్వులు మేరకు అనంతపురం డీఎస్పీ జి. వీరరాఘవరెడ్డి, అనంతపురం ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నగర పోలీసులు మరియు సెబ్ విభాగం సిబ్బంది విధ్వంసం చేశారు. ఈ సందర్బంగా 38 ఎన్ డి పి ఎల్ , 34 డి పి ఎల్ మొత్తం 72 కేసుల్లో సీజ్ చేసిన కర్నాటక, ఇతర రాష్ట్రాల మద్యం, నాటు సారాను స్థానిక టి. వి. టవర్ సమీపంలోని బయలు ప్రదేశంలో రోడ్డు రోలర్ ద్వారా నేల మట్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాల్గవ పట్టణ సి. ఐ జాకీర్ హుస్సేన్, ఎస్సై గంగాధర్, సెబ్ అధికారులు, రెవిన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.