ఓ వివాహ వేడుకలో సంప్రదాయ నృత్యం చేస్తూ ఓ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్పుర్ లోని ఒజార్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అందరూ కలిసి కర్రలతో దాండియా లాంటి నృత్యం చేశారు. ఈ క్రమంలోనే 60 ఏళ్ల ముర్సా దావర్ కుప్పకూలాడు. చుట్టుపక్కల ఉన్నవారు అతడిని పైకి లేపి, ముఖంపై నీళ్లు చల్లారు. అతడు స్పృహలోకి రాకపోవడంతో అస్ఫత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa