రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన దగ్గర నుండి క్రొత్తగా ఏర్పాటైన జిల్లాలలో పోలీస్ విభాగం బాగా యాక్టీవ్ గా పని చేస్తుందని చెప్పాలి. అందులో పల్నాడు జిల్లా పోలీస్ ఐతే చెప్పాల్సిన పనిలేదు. నాటు సారా దుకాణాలు అరికట్టడం, ఇతర రాష్ట్రాల నుండి తరలించే మద్యాన్ని పట్టుకోవడం లాంటివి రోజు చేస్తూనే ఉంది. తాజాగా జిల్లా పరిధిలోని నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొండపాడు గ్రామంలో గ్యాంబ్లింగ్ స్థావరంపై ఆకస్మిక దాడులు జరిపారు. దాడులలో ఆరుగురు వ్యక్తులను పట్టుకొని 88,070/- రూపాయిలను సీజ్ చేసినట్లు జిల్లా పోలీసు అధికారులు తెలియచేసారు.