ప్లాస్టిక్ ఉత్పత్తుల ముడి వస్తువులు, ఇంటర్‌మీడియర్స్‌పై కస్టమ్స్ డ్యూటీని కూడా తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. స్టీల్‌కు సంబంధించి ముడి ఉత్పత్తులపై దిగుమతి సుంకం తగ్గించడంతోపాటు కొన్ని రకాల స్టీల్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకాన్ని విధిస్తామన్నారు. సిమెంట్, స్టీల్ ధరలను తగ్గించడం కోసం వాటి ముడి వస్తువులు, ఇంటర్మీడియరీలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. సిమెంట్ ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రవాణా సదుపాయాలు మెరుగుపర్చడం ద్వారా సిమెంట్ ధర తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
రోజురోజుకు కేంద్రంపై ప్రజాగ్రహం పెల్లుబిక్కుతున్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం.. గ్యాస్ ధర వెయ్యి దాటడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఓవైపు కరోనా కారణంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోగా.. పెట్రో బాదుడు కారణంగా బస్సు ఛార్జీలు, నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్రం తాజా నిర్ణయంతో ఒకింత ఊరట లభించే అవకాశం ఉంది. పెరుగుతోన్న ద్రవ్యోల్బణానికి సైతం కళ్లెం పడే అవకాశం ఉంది.