మనం సాంకేతికత వైపు అడుగులేస్తున్న తరుణంలో పాస్ వర్డ్ యోక్క ప్రధాన్యత ఎంతో కీలకంగా మారింది. మన సాంకేతికత సమాచారం గోప్యంగా ఉంచేది పాస్ వర్డ్ అన్నది మనం మరవకూడదు. మన జీవితాల్లో పాస్‌వర్డ్స్ అనేవి ఓ భాగమైపోయాయి. మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, డ్రైవ్‌లు, క్లౌడ్ సర్వీస్‌లు, వర్క్ అకౌంట్లు.. ఒక్కటేంటి చాలా వాటికి నిత్యం పాస్‌వర్డ్‌లు ఎంటర్ చేస్తుంటాం. ఆన్‌లైన్‌లో డేటా సేఫ్‌గా ఉండాలంటే పాస్‌వర్డ్స్ ఎంతో ముఖ్యం. అయితే, ఇంతటి ప్రాధాన్యమున్న పాస్‌వర్డ్‌లను కొందరు తేలికగా తీసుకుంటారు. సులభమైన పద్ధతిలో వేరే వారు ఊహించేలా సెట్ చేసుకుంటుంటారు. ఇలా చేస్తే మీ సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. 111111, 123456, Qwerty లాంటి పాస్‌వర్డ్‌లను పెడితే చాలా డేంజర్. ఓ క్రమపద్ధతిలో ఉండే అంకెలను, సంఖ్యలను పాస్‌వర్డ్‌గా ఉంచకూడదు. ఇతరులు ఎవరూ ఊహించని విధంగా క్లిష్టంగా ఉండాలి. బలమైన పాస్‌వర్డ్‌ను ఎలా సెట్ చేసుకోవాలి.. అందుకు పాటించాల్సిన టిప్స్ ఏవో నేడు (మే 5) ప్రపంచ పాస్‌వర్డ్ డే సందర్భంగా ఇక్కడ తెలుసుకోండి.
ఎప్పుడైనా సరే.. అప్పర్‌కేస్, లోయర్‌కేస్ లెటర్స్, నంబర్స్, సింబల్స్.. కాంబినేషన్‌తో పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి. ఏ అకౌంట్ అయినా సరే.. ఇవన్నీ కలిపి ఉండేలా పాస్‌వర్డ్ సృష్టించుకోవాలి. అప్పుడే ఎవరూ దాన్ని అంచనా వేయలేరు. ఫోన్ నంబర్లను, అడ్రెస్‌లను, బర్త్‌డేలను, మీ పేర్లను, కుటుంబ సభ్యుల పేర్లను పాస్‌వర్డ్‌గా పెట్టుకోకూడదు. డేటా బ్రీచెస్, సైబర్ అటాక్స్ నుంచి తప్పించుకోవాలంటే సెక్యూర్ పాస్‌వర్డ్స్ 12 నుంచి 16 క్యారెక్టర్స్ ఉండాలి. అలాగే డిక్షనరీలో ఉండే పదాలను పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకోకూడదు. ఎందుకంటే హ్యాకర్లు.. కొన్ని సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి డిక్షనరీ పదాలను స్కాన్ చేసి పాస్‌వర్డ్‌లను క్రాక్ చేస్తారు. అందుకే లెటర్స్, నంబర్స్, సింబల్స్.. సమ్మేళనంతో పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి.
పాస్‌వర్డ్‌లను ఇలా మేనేజ్ చేసుకోండి
మీ అకౌంట్లకు అదనపు సంరక్షణగా టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్ (2FA) ఎనేబుల్ చేసుకుంటే మంచిది. దీని ద్వారా పాస్‌వర్డ్ టైప్ చేసినా.. లాగిన్ అవ్వాలంటే మీ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాస్‌వర్డ్ మరిచిపోతామేమోనని అనుకుంటే, పాస్‌వర్డ్ మేనేజర్‌ను వినియోగించండి.
అలాగే అకౌంట్లకు తరచూ పాస్‌వర్డ్స్ మారుస్తూ ఉండండి. అధికారిక యాప్ స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్ మాత్రమే వాడడం మంచిది. వాటిలోనే లాగిన్ అవ్వాలి. ఇతర సోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్‌లో పాస్‌వర్డ్ ఎంటర్ చేయడం అంత శ్రేయస్కరం కాదు.
ఎక్కువగా వినియోగిస్తున్న పాస్‌వర్డ్‌లు ఏవో డార్క్ వెబ్ ద్వారా వెల్లడయ్యాయి. ఇలాంటి పాస్‌వర్డ్‌లు సెట్ చేసుకుంటే మీ సమాచారానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఎక్కువ. అవేంటో చూడండి.
123456
123456789
Qwerty
Password
12345
12345678
111111
1234567
123123
Qwerty123
ఈ పాస్‌వర్డ్‌లను ఎట్టిపరిస్థితుల్లో వినియోగించవద్దు.