ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి మండపంలోనే పాడుపని.. ఇద్దరు యువతులతో రూంలో అడ్డంగా దొరికిపోయిన వరుడు

national |  Suryaa Desk  | Published : Tue, Nov 26, 2024, 10:32 PM

మరికాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా.. పెళ్లి కొడుకు చేసిన పనికి.. ఆ పెళ్లి పెటాకులు అయిపోయింది. పెళ్లి చేసుకునేందుకు ఫంక్షన్ హాల్‌కు వచ్చిన ఆ వరుడు.. తన రూంలో ఇద్దరు యువతులతో మద్యం, సిగరెట్ తాగుతూ.. పెళ్లి కుమార్తె సోదరుడికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వెంటేనే పెళ్లి కొడుకు చేస్తున్న నిర్వాకాన్ని.. కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పెళ్లి కూతురు.. ఆ పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ క్రమంలోనే రెండు కుటుంబాల మధ్య చెలరేగిన పంచాయతీ కాస్తా.. పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది.


కాన్పూర్‌లోని దామోదర్ నగర్‌లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు అయింది. బర్రా వరల్డ్ బ్యాంక్ ప్రాంతానికి చెందిన హిమన్షు అనే ఆర్కెస్ట్రా వర్కర్‌కు పెళ్లి కుదిరింది. దామోదర్ నగర్‌కు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిర్చారు. నవంబర్ 24వ తేదీన(ఆదివారం) రాత్రి దామోదర్ నగర్‌లోని పెళ్లి మండపానికి హిమన్షు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. పెళ్లి పనుల్లో భాగంగా వధూవరులు దండలు కూడా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే బట్టలు మార్చుకునేందుకు వరుడు.. తన రూంకు వెళ్లాడు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి తర్వాత.. వధువు సోదరుడు ఆ రూంకు వెళ్లాడు. అక్కడ జరిగే ఘటన చూసి అతడు షాక్ అయ్యాడు. ఆ రూంలో వరుడు.. అతని ఇద్దరు మహిళా స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ.. సిగరెట్ తాగుతూ కనిపించాడు.


దీంతో ఆ విషయం మొత్తాన్ని ఆ వధువు సోదరుడు బయటికి వెళ్లి.. తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. వెంటనే వాళ్లంతా వచ్చి గొడవ పెట్టుకున్నారు. ఆ తర్వాత మధ్యవర్తిత్వం చేసి.. పెళ్లి జరిపించేలా కుటుంబ సభ్యులు చర్చలు జరిపారు. ఇక పెళ్లి కూతురు అయితే తనకు ఈ పెళ్లి వద్దని తెగేసి చెప్పింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ఘర్షణ మరింత ముదిరింది. దీంతో రెండు వర్గాలు కలిసి.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com