తాను వాడే ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్ అని వైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఇదిలావుంటే తనకు యాపిల్ ఐఫోన్‌ల కంటే ఆండ్రాయిడ్ మొబైళ్లే ఇష్టమని గతంలోనూ బిల్ గేట్స్ చెప్పారు. తన ప్రధాన ఫోన్‌గా ఆండ్రాయిడ్ ఉంటుందని, ఐఫోన్ కూడా వినియోగిస్తుంటానని వెల్లడించారు. అయితే తనకు ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్ ఇష్టమని చెప్పారు. అయితే ఇప్పడే తొలిసారి తాను వాడుతున్న మొబైల్ మోడల్‌ను వెల్లడించారు.
దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రస్తుతం ఏ స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. అయితే ఆయన యాపిల్ ఐఫోన్ ను వినియోగించడం లేదు. ఓ ఫోల్డబుల్ ఫోన్ వాడుతున్నారు. అయితే అది మైక్రోసాఫ్ట్‌కు చెందిన మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యుయో కూడా కాదు. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయినందున ఆ సంస్థకు చెందిన స్మార్ట్‌ఫోన్‌నే వాడతారని అనుకోవడం సహజం. అయితే బిల్ గేట్స్ మాత్రం వేరే మొబైల్ వాడుతున్నారు. రెడిట్ లో ఎదురైన ప్రశ్నకు సమాధానిస్తూ తాను వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్ గురించి గేట్స్ చెప్పారు.
రెడిట్ ఆస్క్ మీ ఎనీథింగ్ ఈ వారం సెషల్‌లో బిల్ గేట్స్ ఈ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం తాను సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్టు చెప్పారు. “నా దగ్గర ఆండ్రాయిడ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఉంది. నేను డిఫరెంట్‌గా ప్రయత్నిస్తుంటాను. స్క్రీన్ పెద్దగా ఉండడంతో పోర్టబుల్ పీసీలా, ఫోన్‌లా ఈ మొబైల్ ఉపయోగపడుతుంది” అని బిల్ గేట్స్ సమాధానమిచ్చారు. మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం ఉండడం కూడా గేట్స్.. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 వాడుతుండడానికి ప్రధాన కారణంగా ఉంది. సాధారణంగా గెలాక్సీ ఫ్లాగ్‌షిప్ మొబైళ్లలాగే సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3లోనూ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ లాంటి మైక్రోసాఫ్ట్ సూట్ యాప్స్, సర్వీస్‌లు ఉన్నాయి. అలాగే ఎస్ పెన్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.