నెల్లూరు జిల్లా, స్థానిక నెల్లూరు నగరంలో జనసేన ఇంచార్జి కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో "పవనన్న ప్రజాబాట " కార్యక్రమం జరుగుతున్నా సంగతి తెలిసిందే. ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికై పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా కలిసిన ప్రజల ఆవేదనలలో ఒకటి పంచుకొని ఆయన భాధపడ్దారు. "బిడ్డలకు అరువుగా అంత కూడు పెట్టుకోవడానికి లేకపోయా.. మంచి గుడ్డలేసుకోడానికి లేకపోయా.. ఇంక దేనికయ్యా ఈ ప్రభుత్వం.. నల్లిని నలిపినట్లు నలుపుతున్నారు మమ్మల్ని.. బీదోళ్ళని.." అని అంటున్న మహిళా వీడియో చూపిస్తూ... పవనన్న ప్రజాబాటలో వైసీపీ ప్రభుత్వ తీరుపై ఓ అవ్వ ఆవేదన చూడండి అని తెలియపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa