భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపురంలోని కొరచరపేటెలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ మిథున్ కుమార్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
అరవింద్, మమత (30) దంపతులకు ఇద్దరు మగ పిల్లలున్నారు. అరవింద్ పానీపూరి షాపులో పని చేసేవాడు. అతడు తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమెతో గొడవపడేవాడు. శనివారం అర్ధరాత్రి కూడా తన భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఆమె తలను నేలకేసి కొట్టాడు. దీంతో ఆమె నోట్లో నుంచి, చెవుల్లో నుంచి రక్తం కారి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకుని నిందితున్ని పట్టుకున్నారు. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో వారి పిల్లలిద్దరూ దిక్కులేనివారయ్యారు.