గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తూరు నగరం , 3వ వార్డు (దొడ్డిపల్లి) వినాయకస్వామి గుడి లో చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, వార్డు సచివాలయం సిబ్బంది, వార్డు వాలంటీర్స్ తో కలిసి వార్డులో ప్రతి ఇంటి గడప గడపకు వెళ్లి సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ మూడు సంవత్సరాలలో రాష్ర్టంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అందింది లేనిది స్వయంగా ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ లేదు అని స్థానికులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ సునీత శివ కుమార్ , కో ఆప్షన్ మెంబర్ నలిని, చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అముద , ఏపీ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ , డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్ , రాజేష్ కుమార్ రెడ్డి , చూడ చైర్మన్ పురుషోత్తం రెడ్డి , టౌన్ బ్యాంక్ చైర్మన్ రామ్ గణేష్ , వైఎసఆర్సిపి కార్పొరేటర్లు జ్ఞాన జగదీష్ , మధు రెడ్డి , కుటి రాయల్ తదితరులు పాల్గొన్నారు.