స్పందన కార్యక్రమం సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ప్రజల వద్దకు నేరుగా వచ్చి వారితో మాట్లాడారు. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లాఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం స్పందన హల్ బయట ప్రజల కోసం ఏర్పాటు చేసిన టెంట్ వద్ద, ప్రజల కోసం ఏర్పాటు చేయించిన మంచినీరు, ఫ్యాన్ సదుపాయాలను పరిశీలించి, పిర్యాదు దారులతో గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మాట్లాడారు.