దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగిది. తన లవర్ కి, తనకు అడ్డొస్తున్నాడని ఓ భార్య భర్తను చంపించేసింది. ఈ దారుణ ఘటన కల్కాజీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కల్కాజీలోని అపార్ట్ మెంట్ లో స్వర్ణాలి ఘోష్ అనే మహిళ ఉండేది. ఆమె తన భర్తకు తెలియకుండా తన లవర్ మోహన్ పాల్ తో రెండెళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో తన భర్తకు తమకు అడ్డుగా ఉన్నాడని లవర్ తో కలిసి ప్లాన్ వేసింది. ఇద్దరు కలిసి భర్తపై కత్తితో దాడి చేశారు. ఆమె తన భర్తను గట్టిగా పట్టుకుంటే ప్రియుడు మోహన్ పాల్ ఆమె భర్తను హత్య చేశాడు. ఘటన జరిగాక మోహన్ పాల్ వెస్ట్ బెంగాల్ కు పరారయ్యాడు. శవాన్ని ఇంటి ముందే పడేయడంతో గుర్తు తెలియని దుండుగులు చంపేశారని భార్య ప్లాన్ వేసింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి భార్య చీకటి కోణాన్ని బయటపెట్టారు. పరారీలో ఉన్న మోహన్ పాల్ ను కూడా అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు.