రాష్ట్రంలో ప్రభుత్వం తీరుపై ప్రజలు అసహనం చేస్తున్నారని జనసేన నాయకులు ఆళ్ళహరి మండిపడ్డారు. గడప గడప కార్యక్రమం పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేరకు గడప గడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, కార్యక్రమంలో వారికి అడుగడుగునా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని జనసేన గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళహరి అన్నారు. మంగళవారం ఉదయం గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని శ్రీనివాసరావుపేట లో ఆళ్ళహరి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైసీపీ పై విరుచుకుపడ్డారు.