విజయవాడ 43వ డివిజన్ లోని 134వ సచివాలయం పరిధిలో 12వ రోజు మంగళవారం నాడు గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ఊర్మిళ సుబ్బారావు నగర్ లో తదితర ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ ఈ రోజు 134 సచివాలయంలో రొండో రోజు పర్యటించడం జరిగిందన్నారు. ఈ డివిజన్ నూతనంగా రోడ్ల నిర్మాణం జరిగింది ఇంకా కొన్ని రోడ్లు అభివృద్ది పర్చలసింది వుంది అవి కూడా త్వరితగతిన అభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జగన్ అన్న సూచనతో ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయ లేదా అనేది అడిగి తెలుసుకుంటున్నమన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో వున్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు.
మీడియా మిత్రులందరిని గౌరవించలనే వుంటుంది పచ్చ మీడియా వారు మా పై దృస్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలందరూ కూడా గడప గడప కార్యక్రమంలో మమల్ని సాధార స్వాగతం పలుకుతూ హారతులు పడుతుంటే ఈ పచ్చ పత్రికలు మమల్ని నిలదీశారు అని రాయడం సబబు కాదన్నారు. పచ్చ మీడియా వారు ఇష్టం వుంటే మతో రండి కష్టం అయితే రావ్వద్దు అని అన్నారు. ఆంధ్రజ్యోతి వాళ్లకు నిజాలు రాసే అలవాటు లేదా అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి పత్రికను ప్రజలు ఎవరు కూడా చదవవద్దు అని అది ఒక్క వేస్తూ పేపర్ అని అన్నారు.
గడప గడప కార్యక్రమాన్ని రాదంతం చేయడానికి పచ్చ మీడియా వారు రావద్దు అని అన్నారు. అన్ని సచివాలయలలో కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుందని ప్రతి గడపలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయన్నారు. నవరత్నాలు అందుకునే ప్రజలందరూ రానున్న రోజులలో ఓటు అనే రత్నని జగన్ అన్నకు వేయాలని తెలిపారు. విజయవాడ లో చంద్రబాబు కి స్థానం గలతైందన్నారు. జగన్ దెబ్బకు చంద్రబాబు కి వడదెబ్బ తగిలిందన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.