దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్భీఐ ఓ కొత్త రుణ సదుపాయాన్ని తీసుకొచ్చింది. రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పేరుతో రుణ సదుపాయం తీసుకొచ్చింది. ఎస్‌బీఐ వ్యక్తిగత రుణాల జారీకి ఈ సరికొత్త సర్వీసును ప్రారంభించింది. రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పేరుతో ఎస్‌బీఐ యోనో యాప్‌లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రెడిట్ సాయంతో బ్యాంకు కస్టమర్లు ఇంట్లోనే కూర్చుని రూ.35 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. ఈ రుణం కోసం బ్యాంకుకి వెళ్లాల్సినవసరం లేదు.
అయితే రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ సౌకర్యం అందరికీ కాదు. కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రక్షణ సర్వీసులు అందజేస్తోన్న ఉద్యోగులకు మాత్రమే ఈ క్రెడిట్‌ను అందిస్తామని బ్యాంకు చెప్పింది. యోనో యాప్ సాయంతో, ఎంత రుణం పొందవచ్చు, అర్హత ఏమిటి..? ఇతర డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ను ఇంట్లోనే కూర్చుని పూర్తి చేసుకోవచ్చు.
వ్యక్తిగత రుణమనేది బ్యాంకు అందిస్తోన్న ప్రత్యేక ఫీచర్ అని ఎస్‌బీఐ చెప్పింది. బ్యాంకు చెందిన పెద్ద మొత్తంలో కస్టమర్లు ఈ ఫీచర్ నుంచి ప్రయోజనం పొందుతున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకు రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ సౌకర్యాన్ని ప్రారంభించినట్టు తెలిపింది. డిజిటల్ మార్గంలో వేతన జీవులకు వ్యక్తిగత రుణాలను అందించడమే ఈ సర్వీసు ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొంది. యోనో యాప్ ద్వారా కస్టమర్లు ఈ సౌకర్యం నుంచి ప్రయోజనం పొందవచ్చని చెప్పింది. ఇది పూర్తిగా 100 శాతం కాగిత రహితమని తెలిపింది.
8 స్టెప్స్‌లో ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా డిజిటల్‌గా రూ.35 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చని బ్యాంకు తెలిపింది. ఈ ప్రక్రియనంతా ఆన్‌లైన్‌గా పూర్తి చేసుకోవచ్చని, దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ ఉద్యోగులు బ్యాంకుకు రావాల్సినవసరం లేదని తెలిపింది.