ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీరప్పన్ అన్న మృతి

national |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 05:06 PM

మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా వీరప్పన్ పెద్దన్న మత్తయ్యన్ మరణించారు. 75 ఏళ్ల మత్తయ్యన్ తమిళనాడులోని సేలం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. వీరప్పన్ తో పాటు మత్తయ్యన్ కు అనేక నేరాలకు పాల్పడ్డారు.


ఓ హత్య కేసులో నేరం రుజువుకావడంతో సేలం సెంట్రల్ జైలులోనే మత్తయ్యన్ జీవిత ఖైదుగా శిక్షను అనుభవిస్తున్నాడు. వయసుతోపాటుగా ఆరోగ్య సమస్యలు రావడంతో మే 1న గుండెపోటు వచ్చింది. దీంతో మత్తయ్యన్ ను జైలు అధికారులు సేలం ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ నేడు ఉదయం మత్తయ్యన్ కన్నుమూశారు. ఆయన మరణాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com