అమలాపురం ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే డీజీపీతో సమీక్షించారు. ఆందోళనను అదుపు చేసేందుకు అదనపు డీజీ, డీఐజీ, ఎస్పీలు, అదనపు బలగాలను రప్పించామని, అమలాపురంలో ఆందోళనను అదుపులోకి తెచ్చామని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో 7 కంటే ఎక్కువ కేసులున్న 72 మందిని గుర్తించిన పోలీసులు వారిలో 46 మందిని అరెస్టు చేశారు. ఎమ్మెల్యే ఇళ్లపై దాడి చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు మంత్రి తెలిపారు.