కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంలో మంగళవారం జరిగిన గొడవ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బీఎస్పీ తెలంగాణ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం స్పందించారు. స్వాతంత్ర్యం నుండి ప్రభుత్వాలు అన్ని స్కీములకూ,రోడ్లకు,పార్కులకూ,డ్యాములకూగాంధీ,నెహ్రూల పేర్లు పెట్టినా,జనాభాలో 90% ఉన్న బడుగు బలహీన వర్గాలు మౌనంగా ఉన్నాయన్నారు.ఇప్పుడు కేవలం ఒక కోనసీమకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గారి పేరు పెడ్తెనే ఎట్ల వ్యతిరేకిస్తున్నరు? ఇంకా చాలా లెక్కలు తేలాల్సి ఉంది అని అయన ట్వీట్ చేశారు.