ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా వ్యాక్సినేషన్ అనంతరం అనారోగ్యంతో బాలిక మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 02:05 PM

హుకుంపేట మండలంలోని పెదగరువు బాలికల ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని సీదరి. స్వాతి 3వ తారీఖున కరోనా వ్యాక్సినేషన్ అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ నేపధ్యంలో తల్లిదండ్రులు 15 తేదీన పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్ వైద్యులు తరలించారు. ఈ నేపథ్యంలో బాలిక చికిత్స పొందుతూ ఉదయం 6. 30 గంటల సమయంలో తుది శ్వాస విడిచింది. పాఠశాల యాజమాన్యానికి ఫోన్లో సంప్రదించిన కనీసం స్పందించలేదని విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమను ఆదుకోవాలని కన్నీరుమున్నీరుగా విలపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com