రాష్ట్రంలో పండించిన పంటలకు గిట్టు బాటు ధర కల్పిస్తాం అని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలెట్టలేదు. కొన్ని చోట్ల ప్రారంభమైన కానీ, రైతులకి ఇంతవరకు సొమ్ము చెల్లించలేదు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ రాష్ట్ర నాయకులూ సోము వీర్రాజు మాట్లాడుతూ.... మిల్లర్లు,దళారులు కారణంగా రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు.అహర్నిశలు శ్రమించి పండించిన ధాన్యం అమ్మకం తర్వాత కూడా రైతన్న చేతికి సకాలంలో డబ్బులు ఇవ్వడం లేదు.ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, రైతన్నకు న్యాయం జరిగే పరిస్థితి లేదు అని అన్నారు. ఇదే విషయంపై వైసీపీ నాయకులూ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఈ మధ్య కాలంలో మాట్లాడిన సంగతి తెలిసిందే.