గుంటూరు: ఎందరో త్యాగధనుల త్యాగాల ఫలితమే ఆంధ్ర రాష్ట్రం అని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. ప్రథమాంధ్ర మహాసభ నూట 9వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్థానిక కోన కళాక్షేత్రం భవన్లో జరిగిన కార్యక్రమంలో మహానుభావులకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, సామాజిక వేత్తలు, ప్రజలు పాల్గొన్నారు.