ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన గణేష్ ను ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి మోసం చేసింది. వీడియో కాల్ కోసం గణేష్ ఫోన్ కి ఒక లింక్ ను పంపింది. ఆశతో గణేష్ ఆ లింక్ తో యాప్ ను డౌన్‌లోడ్ చేశాడు. ఈ నెల 23న నెట్ బ్యాలెన్స్ కోసం రూ.20 పంపాలని గణేష్ ను ఆ యువతి కోరింది. గణేష్ రూ.20 పంపాడు. వెంటనే అతని అకౌంట్ నుంచి రూ.2.5 లక్షలు డెబిట్ అయ్యాయి. మోసపోయిన గణేష్ పోలీసులను ఆశ్రయించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa