దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 536 పాయింట్ల లాభంతో 54.784 వద్ద కొనసాగుతుండగా, నిప్టీ 148 పాయింట్ల లాభంతో 16,318 వద్ద ట్రేడవుతోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్ సిఎల్, విప్రో, బజాబ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ, మారుతీ సుజుకి కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, ఏషియన్ పెయింట్స్, టాటా స్టిల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబా్, పవర్ గ్రిడ్, ఎన్టీపిసి కంపెనీల షేర్లు నష్టాల్లో చలస్తున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియగా.. టెక్ స్టాక్ లలో కొనుగోళ్లు ప్రారంభం కావడంతో మార్కెట్లకు కలిసొచ్చింది.