పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నుల భారం తగ్గించాలని వినతి చేస్తూ సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఏపీ కంటే కర్ణాటకలో పెట్రోల్ ధరలు తక్కువ అని అన్నారు.పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాలు పన్నులు తగ్గించాయని తెలిపారు. రాష్ట్రంలో నిత్యవసరాల ధరలు పెరిగాయని మండిపడ్డారు. విద్యుత్, బస్సు ఛార్జీలు, ఆస్తి, చెత్త పన్నులు పెంచారన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ధరలు, పన్నుల భారాలు తగ్గించాలంటూ రామకృష్ణ లేఖలో డిమాండ్ చేశారు.