ఎన్టీఆర్ పేరును స్మరించే హక్కు చంద్రబాబుకు లేదని వైయస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కష్టపడి స్థాపించిన పార్టీని లాక్కుని, ఆయన మరణానికి చంద్రబాబు కారకుడయ్యారని తెలిపారు. బీసీలను చంద్రబాబు జెండాలు మోసేందుకే వాడుకున్నారని తెలిపారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేశారన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. గుంటూరులో పార్టీ ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దలగిరిలతో కలిసి మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడారు.