కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన వినుకొండ మండలంలోని కొప్పుకొండలో గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం గ్రామానికి చెందిన కొటారి స్వర్ణ రేఖకు ఐదేళ్ల క్రితం పట్టణంలోని పాటిమీద బజార్ కు చెందిన మాటూరు వెంకటరావుతో వివామైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఈ క్రమంలో రెండేళ్ల నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధిస్తున్నాడు. దీంతో కొన్ని నెలలుగా ఆమె పుట్టిం ట్లోనే ఉంది. బంధువులు రాజీ కుదిర్చి కర్నూలులో ఉన్న భర్త వద్దకు బుధవారం తీసుకెళ్లారు. భార్య వచ్చిన సమాచారం తెలుసుకుని భర్త వినుకొండకు వచ్చాడు. తిరిగి ఆమె కొప్పుకొండకు వచ్చి ఇంటిని శ్రుభం చేసే ద్రావణం తాగగా ఆమెను స్థానికులు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.