కన్నూర్ నుంచి దుబాయ్ వెళ్తున్న గోఫస్ట్ విమానంలో శుక్రవారం యూనస్ రేయన్రోత్ అనే ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. ఈ హఠాత్పరిణామంతో విమానంలోని ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రయాణికుల్లో ఓ డాక్టర్ ఉండడంతో ముప్పు తప్పింది. బాధితుడికి డా.షబర్ అహ్మద్‌తో క్యాబిన్ సిబ్బంది వెంటనే సీపీఆర్ చేశారు. రెండు సెట్ల ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్స్తో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కాసేపటికి బాధితుడు కోలుకున్నాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.