టెక్సాస్ కాల్పుల ఘటనలో మియా సెరిల్లో అనే 11 ఏళ్ల బాలిక సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలతో బయటపడింది. యువాల్టీలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో మంగళవారం సాల్వడార్ రామోస్ అనే యువకుడు గన్ తో టీచర్ను, కొంత మంది స్టూడెంట్స్ ను కాల్చి చంపాడు. అక్కడే ఉన్న మియా తన ఫ్రెండ్ ఒంటిపై రక్తాన్ని తీసుకుని తన ఒంటికి పూసుకుని చనిపోయినట్టు నటించింది. అనంతరం 911 కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది.