సిమెంట్ ధరలను పెంచుతున్నట్లు ఇండియా సిమెంట్స్ కంపెనీ ప్రకటించింది. దశలవారీగా ధరలను పెంచనుంది. జూలై 1 నాటికి ఒక్కో బస్తాపై రూ.55 పెంచనున్నట్లు కంపెనీ పేర్కొంది. జూన్ 1న ఒక్కో బస్తాకు రూ.20, జూన్ 15న రూ.15, జూలై 1న రూ.20 పెంచనుంది. అంటే జూలై 1 నాటికి ఒక్కో బస్తాపై రూ.55 పెంచుతున్నట్లు ఇండియా సిమెంట్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీనివాసన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa