ఢిల్లీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం, ఢిల్లీలో గత 24 గంటల్లో 357 కొత్త కరోనా కేసులు నమోదుయ్యాయి.బులెటిన్ ప్రకారం, ఢిల్లీలో యాక్టివ్ కోవిడ్ కేసులు 1,624గా ఉన్నాయి. దేశ రాజధానిలో గత 24 గంటల్లో మొత్తం 19,478 కోవిడ్ నమూనాలను పరీక్షించారు. గత 24 గంటల్లో 374 మంది కరోనా నుండి కోలుకున్నారు, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 18,78,479కి చేరుకుంది.గత 24 గంటల్లో సున్నా మరణంతో, నగరంలో మరణాల సంఖ్య 26,208కి చేరుకుంది.