ఏపీ సీఎం జగన్ సరిగ్గా మూడేళ్ల కిందట ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మూడేళ్ల కిందట ఇదే రోజు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. 175 సీట్లకు వైసీపీ 151 సీట్లు గెలిచింది. మే 30, 2019న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో వైసీపీ 22 చోట్ల విజయం సాధించింది. అంతకుముందు ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలకు, 3 లోకసభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది.