తమ ప్రభుత్వ మూడేళ్ల పాలనపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. 'మీ ప్రేమ, ఆశీస్సులతో సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. మరోసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా' అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.