అమెరికా నుండి తక్కువ ధరకు లాప్ టాప్, ఫోన్ తెప్పిస్తానని మోసం చేయడంపై వన్ టౌన్ పీఎస్ లో కేసు నమోదైంది. తెనాలి షరాఫ్ బజార్ కు చెందిన ఆభరణాల వ్యాపారి వద్దకు హైదరాబాద్ లో నివాసముంటున్న పోతూరి రామారావు వచ్చి తన కుమార్తె అమెరికా నుండి రాబోతుందని తక్కువ ధరకే ల్యాబ్ టాప్, ఫోన్లు తెప్పిస్తానని చెప్పి రూ.2 లక్షలు తీసుకున్నాడు. వస్తువులు ఇవ్వక, డబ్బులు చెల్లించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.