వొడాఫోన్ ఐడియా షేర్ల ధరలు ఇవ్వాళ ఒక్కసారి పెరిగాయి. ఈ పెరుగుదల కేవలం అయిదు శాతం. అయినప్పటికీ.. పెద్ద సంఖ్యలో షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు కొత్తగా ఊపిరి పోసింది ఈ పరిణామం. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో అయిదు శాతానికి పైగా వొడాఫోన్ ఐడియా షేర్ల ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. రూ.20,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి అమెజాన్ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది.