ఉసిరి గింజలను ఎండబెట్టి చేసిన పొడిని పేస్ట్‌గా చేసుకొని తలకు పట్టిస్తే వేడి కారణంగా ముక్కు నుంచి రక్తం వచ్చే సమస్య తగ్గుతుంది. జామ, ఉసిరి గింజలను కొబ్బరి నూనెలో వేసి పేస్ట్ చేసుకుని ముఖంపై మొటిమలున్న చోట రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. ఉసిరి గింజల పొడిని గోరు వెచ్చని నీళ్లలో కలిపి తాగితే మలబద్ధకం తగ్గుతుంది. ఎక్కిళ్లు కొందరికి ఎక్కువ వస్తుంటాయి. వారు ఉసిరి గింజల పొడిని తేనెతో కలిపి తీసుకోవాలి.