ప్రేమించానంటూ ఓ యువతికి దగ్గరై, మరో మహిళ మెడలో తాళి కట్టేందుకు సిద్ధమైన ప్రియుడిపై కేసు నమోదైంది. ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వేల్పూరు యువతి (23)ని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్‌కు చెందిన కొండేటి అలెగ్జాండర్ ప్రేమించానంటూ వెంటపడ్డాడు. పెళ్లికి అతడి తరపు వారు అంగీకరించారు. తీరా ఇటీవల మరో మహిళతో పెళ్లి కుదుర్చుకున్నారు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.