సిద్ధూ మూసేవాలాను గ్యాంగ్‌స్టర్ అని తాను అనలేదని పంజాబ్ డీజీపీ వీకే బావ్రా అన్నారు. తన కుమారుడిని డీజీపీ గ్యాంగ్‌స్టర్ అని సంబోధించినట్లు సిద్ధూ తండ్రి పంజాబ్ సీఎంకు లేఖ రాశారు. దీనిపై తాజాగా డీజీపీ వివరణ ఇచ్చారు. సిద్ధూ హత్యకు తామే కారకులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిందన్నారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని సోమవారం ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు.