వారణాసి జిల్లా కోర్టు జ్ఞానవాపి మసీదు కేసు విచారణను జూలై 4వ తేదీకి వాయిదా వేసింది. జూలై 4న హిందువుల తరఫు వాదనలను వింటామని తెలిపింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో ఉన్న శృంగార గౌరి దేవతకి పూజలు చేసుకోవడానికి అనుమతి కోరుతూ ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మసీదులో వీడియోగ్రఫీ సర్వే నిర్వహించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను జిల్లా కోర్టు చేపట్టింది.