కృష్ణాజిల్లాలో మూడో విడతగా చేపట్టిన భూముల రీ సర్వేపై జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే వేగవంతానికి తీసుకోవల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద కేటాయించిన రెండు గ్రామాల్లో రీసర్వే పనులు పూర్తయ్యాయని, మూడో దశకు ఎంపిక చేసిన 69 గ్రామాల్లో కూడా పనులు వేగవంతం అయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ నుండి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ కు జిల్లాలోని రెవెన్యూ, హౌసింగ్, జడ్పీ, ల్యాండ్ సర్వే, డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.