తిరుపతిలో మద్యం తాగి వాహనాలు నడపడం, పబ్లిక్ స్థలంలో పేకాట ఆడడం తదితర నేరాలకు పాల్పడిన 45 మందికి రూ. 1, 22, 140 జరిమానా విధిస్తూ తిరుపతి మొదటి ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ సుబ్బలక్ష్మి సోమవారం తీర్పు చెప్పారు. పేకాటరాయుళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 19, 800 లను ఈస్ట్ పోలీస్ లు కోర్ట్ లో జమ చేశారు. ఇలాంటి అవాంతారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మెజిస్ట్రేట్ తెలిపారు.