ప్రస్తుతం నగరాల్లో ఉండే ప్రజలు అర్బన్ ఫార్మింగ్ (నగరాల్లో సేద్యం) వైపు మొగ్గు చూపుతున్నారు. సిటీల్లోని తమ నివాసాల్లో ఉన్న కొంత స్థలంలోనే కొన్ని మొక్కలను పెంచుతున్నారు. కానీ యూపీలోని బరేలీకి చెందిన రాంవీర్ సింగ్ అనే వ్యక్తి మాత్రం తన మూడంతస్థుల భవనంలో ఏకంగా 10 వేల మొక్కలను పెంచుతున్నాడు. ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అర్బన్ ఫార్మింగ్ గురించి, సాగు చేస్తున్న విధానం గురించి వివరించాడు.