ఒక లెస్బియన్ జంటను కుటుంబ సభ్యులు వేరు చేసారు. అయితే వారు కేరళ హైకోర్టు ద్వారా కలిశారు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్‌లో చోటుచేసుకుంది. కేరళకు చెందిన ఆదిల్లా నస్రీన్, ఫాతిమా నూరా ఇద్దరు యువతులకు సౌదీ అరేబియాలో పరిచయమయ్యారు. అక్కడ చదువుతున్నప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ డేటింగ్లో ఉన్నారు.అయితే ఈ విషయం నచ్చని ఇద్దరు కుటుంబ సభ్యులు వారిని విడదీశారు. అయితే తమకు కలిసి జీవించే అవకాశం కల్పించాలని ఆదిల్లా నస్రీన్ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు వారిద్దరూ కలిసి ఉండేందుకు అనుమతించింది.