సంగమేశ్వరం వద్ద నిర్వహించే జలదీక్షకు రాయలసీమ యునైటైడ్ ఫోరం నాయకులు బయలుదేరి వెళ్తుండగా తాడిపత్రి పట్టణ పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ. ప్రజా సంక్షేమం కోసం నిర్వహించే జలదీక్షకు వెళ్లే ఉద్యమకారులను అడ్డుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. అనంతరం ఆందోళనకారులను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. నాయకులు భాస్కర్ రెడ్డి, నాగ రాజు తదితరులు ఉన్నారు.