సీమ చింతకాయలు సాధారణంగా వేసవిలో అందుబాటులో ఉంటాయి. సీమ చింతకాయల్లో పీచు పదార్ధాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు పదార్ధాలు చాలా తక్కువుగా ఉంటాయి. వీటిలో బి1, బి2, బి6, ఏ, సి విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఖనిజ లవణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సీమ చింతకాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- సీమ చింతకాయలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- డిప్రెషన్ తగ్గి మనసుకు ఉల్లాసంగా ఉంటుంది.
- సీమ చింతకాయ గర్భిణులకు కూడా చాలా మంచిది. వారికి కావాల్సిన పోషకాలు వీటిలో లభిస్తాయి.
- ఇవి చర్మం పై వచ్చే ముడతలను తగ్గించి తాజాగా ఉండేలా చేస్తాయి.
- సీమ చింతకాయ తినడం వల్ల శరీరంలో ఉండే రక్తం శుద్ధి చేయబడుతుంది.
- సీమ చింతకాయ ఎముకలను ధృడంగా మారుస్తుంది.
- వీటిలో మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, థైమిన్ కూడా ఎక్కువగా ఉంటాయి.
- వీటిని తినడం వల్ల దంతాలు శుభ్ర పడుతాయి.
- కంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.
- సీమ చింతకాయలు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి.