రాష్ట్రంలో దళితులు గిరిజనులు ఆదివాసీలు మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు నిరసనగా నేడు రాజకీయపార్టీల, దళిత సంఘాల ఛలో రాజ్ భవన్ కు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందం బ్రహ్మస్వరరావు, సిపిఐ నాయకులు అన్నవరపు ప్రభాకర్, గంజి వెంకయ్య, ఎస్. ఎస్. చెంగయ్య, నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషనకు తరలించారు.